ప్రసాదం


ప్రసాదమంటే ప్రసన్నత, తేటదనము, నైర్మాల్యము, మనస్సు, విరాళము, గురువాదులచే భుక్తపరిష్ఠమైన అన్నము, కావ్యగుణములలో ఒక లక్షణముగా దేవ నైవేద్యమనే పరిపరి విధాల అర్థాలున్నాయని లాక్షిణికులు చెబుతారు. అటువంటి ప్రసాదం ప్రసన్నముగా చేస్తుందని, సంతోషపెడుతుందని, ఉపశమింప చేస్తుందని, దానిని ప్రసాదకముగా పిలుస్తారని విజ్ఞులంటారు. అనుగ్రహక పూర్వకముగా, ఉల్లాసము కలిగించేదిగా ప్రసాదము పంచి పెట్టడాన్నే ప్రసాదించుట అని చెప్పుకోవచ్చు.

ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటూ ప్రసన్నమైన, నిర్మలమైన వదనం, రూపం ‘ప్రసాదం’ మొదటి లక్షణమని అనుకుంటే, అటువంటి చిదానందతత్వాన్ని కారుణ్యాన్ని చిరునవ్వు చిందిస్తుందని మందస్మిత సుందర వదనారవిందం స్మేరాననం భగవంతుని ప్రతిరూపాలని భగవత్ తత్వాన్ని విజ్ఞులు వివరిస్తారు. జగజ్జనని ప్రశాంతమైన తేజోవంతమైన చిరునవ్వును స్మితవదన ప్రస్తుతిలో ‘కావ్యకంఠ వాసిష్ఠగణపతి’ అభివర్ణిస్తాడు. చిరునవ్వుల కాంతుల ప్రవాహంలో తనపతిదేవుడైన ఈశ్వరుని మనస్సును మునకలు వేయించే తల్లిగా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడుతుంది.

శ్రీరామ చంద్రుని గుణ గణాల వైభవాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి నవ్వుతూ మాట్లడుతూ వుండేవాడు రాముడని సచనిత్యం ప్రశాంతాత్మి అంటూ స్మిత భాషే అంటూ పేర్కొంటాడు. స్మేరాననం స్మరతి గోపవధూకిశోరం అంటూ లీలాశుకులు కృష్ణన్ని ప్రస్తుతిస్తూ తం సర్వాది గురుం మనోజ్ఞ వపుషం మందస్మితాలం కృతం అని ప్రసన్నవదనంతో ఉండాలని, ప్రసాద భరితమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులు అన్వేషించాలని ఋగ్వేదం ప్రవచిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s