సంస్కృత సూక్తి


సంస్కృత సూక్తి

” అల్పానా మపి వస్తూనాం సంహతి: కార్యసాధికా

తృణైర్గుణత్వ మాపన్నైర్భధ్యన్తే మత్తదన్తిన:

భావము : ఎంత చిన్నవైనను వస్తువులు కలిసిన గొప్ప కార్యములను సాధింపవచ్చును. గడ్డిపరకలను కొన్నిటిని కలిపివేసిన మదగజములను గూడా కట్టివేయవచ్చును. సంఘటనా కార్యమందలి మహత్వమిట్టిదియే.

ఆచార వ్యవహారాలు


ఆచార వ్యవహారాలు

మేము అపార్ట్మెంట్లొ ఉన్నప్పుడు మా ఫ్లోర్లో ఒకరి ఫ్లాట్లో మరణం సంభవించింది.

నా పొరుగువాడు వచ్చి ” సార్ ! మీరు కలగజేసుకుని ఆ శవాన్ని కిందకి మార్చి నీళ్ళు పొయ్యమని చెప్పండి.” అన్నాడు.

నేను : “అయ్యా ! మన మిత్రుల ఇంటిలో వారి ఆప్తులు పోయారు. మనం ఏదైనా సహాయం చెయ్యగలమో అని ఆలోచించండి.

మీరు దేనికి అనవసరంగా కంగారు పడుతున్నారు” అన్నాను.

పొ.వా : ” మీరు పెద్దవారని చెపుతున్నాను. ఆ నీళ్ళు అవీ మన గుమ్మాలలోకి వచ్చి తగలడతాయి. మీరు చెపితే వారు వింటారు కదా !”

నేను : ” వాళ్ళు ఎక్కడ వారి కార్యక్రమాలు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీకు కూడా ఉండకూడదు”

పొ.వా: ” అదేమిటీ అలా మాట్లాడుతారు ! మీకు మడీ, ఆచారాలు ఉన్నాయిగా ! చెప్తారని…. అని నసిగాడు.

నేను : ” అది నిజమే. కానీ ఇక్కడ అది ముఖ్యం కాదు. ఆప్తులు పోయి బాధలో ఉన్నవారికి కాస్త మన వంతు సాయం చేసి స్వాంతన కలుగచేయాలి కానీ, ఇలా ఇబ్బంది పెట్టకూడదు.” అన్నాను.

పొరుగువాడు ” మీరు ఏప్పుడూ ఇలాగే మాట్లాడతారు” అని తనింట్లోకి వెళ్ళిపోయాడు.

నిజానికి ఇలాంటివి అపార్ట్మంట్లలో చాలా అభిప్రాయబేధాలు కలుగజేయవచ్చును.

ఈ సందర్భములో మన సినిమా “శంకరాభరణం” లో శంకర శాస్త్రి ద్వారా శ్రీ జంధ్యాల చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి.

“ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు” అని కులం, దాని అడ్డుగోడలు గురించి ఎంత సున్నితం గా చెప్పారో ఆ మహానుభావుడు.

నిత్య త్రికాల సంధ్యా వందనము


నిత్య త్రికాల సంధ్యా వందనము

శరీర శుద్ధి:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)

భూతోచ్చాటన:
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (తై. అర. 10-27)

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||

మార్జనః
ఓం ఆపోహిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః | (తై. అర. 4-42)
(ఇతి శిరసి మార్జయేత్)
(హస్తేన జలం గృహీత్వా)

ప్రాతః కాల మంత్రాచమనః
సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” || (తై. అర. 10. 24)

మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’‌உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” || (తై. అర. పరిశిష్టః 10. 30)

సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా || (తై. అర. 10. 24)
(ఇతి మంత్రేణ జలం పిబేత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

ద్వితీయ మార్జనః
దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షి తారిషత్ ||
(సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః)
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉశతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జిన్వ’థ | ఆపో’ జనయ’థా చ నః || (తై. అర. 4. 42)

పునః మార్జనః
హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యా అంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజో నిధ’త్త || (తై. సం. 5. 6. 1)
(మార్జనం కుర్యాత్)

అఘమర్షణ మంత్రః పాపవిమోచనం
(హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్)
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః || (తై. బ్రా. 266)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య

లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||

ప్రాతః కాలార్ఘ్య మంత్రం:
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||

మధ్యాహ్నార్ఘ్య మంత్రం:ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ || (తై. అర. 10. 4)

సాయం కాలార్ఘ్య మంత్రం:
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇత్యంజలిత్రయం విసృజేత్)

కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం
ఆచమ్య…
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
(ఇతి జలం విసృజేత్)

సజల ప్రదక్షిణం:
ఓం ఉద్యంత’మస్తం యంత’ మాదిత్య మ’భిథ్యాయ న్కుర్వన్-బ్రా”హ్మణో విద్వాన్ త్సకల’మ్-భద్రమ’శ్నుతే అసావా’దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై. అర. 2. 2)
(ఏవమ్ అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్)
(పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్)
(ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

సంధ్యాంగ తర్పణంప్రాతఃకాల తర్పణం:
సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

మధ్యాహ్న తర్పణం:
సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||

సాయంకాల తర్పణం:
సంధ్యాం తర్పయామి, సరస్వతీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
(పునరాచమనం కుర్యాత్)

గాయత్రీ అవాహన:
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ || (తై. అర. 10. 33)
ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||
ఓజో’‌உసి సహో’‌உసి బల’మసి భ్రాజో’‌உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి సర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతా‌உగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (మహానారాయణ ఉపనిషత్)
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)

జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |

అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |

ధ్యానమ్:
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||

చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం:
సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా |
షణ్ముఖో‌உథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖమ్ |
ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా |
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ ||
యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువస్సువః’ || తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

అష్టముద్రా ప్రదర్శనం:
సురభిర్-ఙ్ఞాన చక్రే చ యోనిః కూర్మో‌உథ పంకజమ్ |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః ||
ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు |
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్విః పరిముజ్య |
సకృదుప స్పృశ్య |
యత్సవ్యం పాణిమ్ |
పాదమ్ |
ప్రోక్షతి శిరః |
చక్షుషీ |
నాసికే |
శ్రోత్రే |
హృదయమాలభ్య |

ప్రాతఃకాల సూర్యోపస్థానం:
ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషా‌உభి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ || (తై. సం. 3.4.11)

మధ్యాహ్న సూర్యోపస్థానం:
ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్య’ంచ | హిరణ్యయే’న సవితా రథేనా‌உదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ఉద్వయ ంతమ’స స్పరి పశ్య’ంతో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమమ్ ||
ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతో‌உర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||

సాయంకాల సూర్యోపస్థానం:
ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనే‌உభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై. సం. 1.1.1)

దిగ్దేవతా నమస్కారః(ఏతైర్నమస్కారం కుర్యాత్)
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమో‌உవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |

ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||

సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామో‌உకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః || (తై. అర. 2.18.52)
ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’‌உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథా‌உంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం):
ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యో‌உభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ || (మహానారాయణ ఉపనిషత్)

భగవన్నమస్కారః
నమో‌உస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||

భూమ్యాకాశాభి వందనంఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయమ్ |
సర్వభూత నివాసో‌உసి శ్రీవాసుదేవ నమో‌உస్తుతే ||
శ్రీ వాసుదేవ నమో‌உస్తుతే ఓం నమ ఇతి |

అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||

ఈశ్వరార్పణం:
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యా‌உ‌உత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |

 

 

ఎక్కడ నేర్చుకున్నావు?


ఎక్కడ నేర్చుకున్నావు?

ఇది 1956-57లలో జరిగిన సంఘటన. కంచి పరమాచార్య స్వామి వారు మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు.

ఒక సాయింత్రం పరమాచార్య స్వామి వారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజి లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొ. శంకరనారాయణ అయ్యర్ ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి, మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేసారు.

ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికి దీని గురించి తెలిసింది. ఈ వ్యాసం వ్రాసిన డా. సి.ఆర్. స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి, వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన రెండు పాదాలు చెప్పారు.

అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి మహాస్వామి వారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు.

స్వామివారు ఆయనతో, “నీకు ఈ శ్లోకం తెలియదన్నావు. మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నవు?” అని అడిగారు.

“సభికులలో ఒకరు గుర్తుతెచ్చుకుని నాకు చెప్పారు పెరియవ” అని బదులిచ్చారు.

మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని, డా. స్వామినాథన్ ను వేదిక పైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు. ఆయన వేదిక పైకి రాగానే, అతని పేరు, వృత్తి మొదలైన వివరములు అడిగి, “ఎక్కడ చదివావు?” అని అడిగారు.

అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకుని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో అని చెప్పారు. అందుకు స్వామివారు ”అది కాదు. ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగారు.

తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు. మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్నవారు మొత్తం విన్నారు. ఆ శ్లోకం ఇదే:

అర్థాతురాణాం న గురుర్ న బంధుః
క్షుధాతురాణాం న రుచికి న పక్వం
విద్యాతురాణాం న సుఖం న నిద్ర
కామాతురాణాం న భయం న లజ్జ

ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి(చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు.

తరువాత పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణంలో కేనోపనిషత్తు గురించి చెబుతూ, పార్వతీ దేవి గురు స్వరూపిణియై దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివర్లో ఇలా అన్నారు.

”ఉపన్యాసం మొదలుపెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు. కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికి తెలియాలి అది ఏదో పాఠశాలలోనో, కళాశాలలోనో నేర్చుకున్నది కాదు. బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది. పిల్లలకు మంచి విషయాలు, విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలలోనో, కళాశాలలోనో కాదు”

ఇంకా స్వామినాథన్ చివరలో ఇలా వ్రాసారు:

నాలాంటి అల్పుడు, సిగ్గు, భయం కలవాడిని కొన్ని వేలమంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికి ఏమి చెప్పలనుకుంటున్నారు అంటే

> పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము, విలువలు నేర్పడం పెద్దలు(నాన్నమ్మలు తాతయ్యలు) ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యం.
> పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్ల్లకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు.
> ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.

— డా. సి.ఆర్. స్వామినాథన్, భారత ప్రభుత్వ మాజీ సహాయ విద్యా సలహాదారు.

మన సనాతన ధర్మ ప్రమాణ గ్రంథాలేమిటి?


భారతమాతా కీ జై !!

మన సనాతన ధర్మ ప్రమాణ గ్రంథాలేమిటి?

విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేలకొలది ఉన్నవి. పుస్తకాలెట్లా అసంఖ్యాకాలుగా వున్నవో అట్లే మతాలూ బహుళంగా వున్నవి. ఏ మతస్థులకు ఆ మతగ్రంథాలు అతిగొప్పగా కనపడటం సహజం. ఎవరిమతాలు వారికి పరమావధి యని తోచటం న్యాయమే. మతాన్ని కాపాడుకొంటూ, జాగ్రత్తగా తమతమ ధర్మాలను పాటిస్తూ, మతగ్రంథాలకు సిక్కులవలె ఆలయాలు సహితం నిర్మించి, మన ఆత్మక్షేమానికి ఇవే మూలమన్న విశ్వాసంతో ఉండే ప్రజానీకాన్ని మనం చూడకపోలేదు.

మరి, మన ధర్మం సంగతియేమి? మన మతగ్రంథమేమిటి? మనకేదైనా పుస్తకమున్నదా? క్రైస్తవుని మతగ్రంథమేది అని అడిగితే నిస్సందేహంగా ‘బైబిలు’ అని బదులు చెపుతాడు. అదేవిధంగా మహమ్మదీయులకు మతగ్రంథం ‘ఖురాను’. వేదాలు పాటించే హిందువులమగు మనకు చెప్పుకోడానికి ఒక్కపుస్తకమయినా ఉన్నట్టు కనుపించదు. శైవులకు ‘తేవారం, తిరువాచికం’ ఉన్నవి. వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం. వారిలో భక్తిమార్గానుయాయులకు రామాయణమే ప్రమాణం. వేదాలు వల్లించే ఘనాపాఠికి వేదాలే ప్రమాణం. ఇంగ్లీషు చదివి ఏదో కొంత వైదిక శ్రద్ధ ఉన్న వారికి గీతపై ప్రీతి. వీరందరూ హిందువులే. కాని వీరికి ఒక్క పుస్తకమనిలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతగ్రంథం.

ఇతర మతస్థులలో లౌకికజ్ఞానం కలగడానికి ముందే, బాల్యంలోనే అంతో ఇంతో మతప్రవేశం కల్గించడానికి పాటుపడతారు. అందుచే వారికి చిన్ననాడే మత సంస్కారాలుకల్గే అవకాశం ఏర్పడుతున్నది. కాని మనదారి వేరు. మనకు శైశవంలో లౌకికవిద్య ప్రధానం; పారమార్థికం అప్రధానం. ఈభావాలతో మన జీవితాలను చక్కదిద్దుకొన్నందువల్ల కలిగిన ప్రయోజనమేమి అని అడిగితే, ‘ఇతర మతాలలో జనం తగ్గినపుడల్లా మనమతంలోనుంచి వారికి కావలసినంతమందిని సరఫరాచేయడం’, ఇట్లాకాక బాల్యమాది మనమూ ఇతర మతస్థులవలె మతవిషయికమైన విజ్ఞానం మన బాలబాలికలకు అందుబాటులో ఉంచకల్గితే, ఇతర మతప్రసక్తికానీ, పరమత స్వీకరణకుకానీ ఎడముండదు. కానీ, వాస్తవవిషయంచూస్తే, మనలో సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసక్తి అరవైఏళ్ళకుగాని కలగటంలేదు. మన పుస్తకాలను మనమే దూషిస్తున్నపుడు, ఇతరులు వానిని తిరస్కరిస్తున్నారే యని శోచించటం అనవసరం.

మన ధర్మము లో చూడబోతే పుస్తకాలనుకాని, అందు చర్చించిన విషయాలకుగాని ఏ విధమైన కొరతయూ లేదు. అనుష్ఠించి, అనుభూతినొంది, ఐకాంతిక ఆనందనిష్ఠలో, ఆత్మానందంలో తేలినవారు ఒక్కరుకాదు, పలువురు. తాము తరించడమేకాక, తమ్ము దర్శించినవారిని సైతం దయతో అనుగ్రహించిన జీవన్ముక్తులు ఎంతమందియో, వీరిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. అసాధారణమైన ఇట్టి అనుభూతికలవా రవతరించిన మనమతంలో ప్రమాణగ్రంథాలు లేకపోతాయా?

భావిక్షేమార్థం అనుషించేది ధర్మం. ఏ విధమైన ఆశాలేనివాడు చేసేధర్మం మోక్షకారకం. అదేధర్మం. అదేమతం. ఆధర్మాచరణకు ప్రమాణం అవసరం. వానిని చెప్పేగ్రంథాలే ధర్మప్రమాణాలు. ప్రమాణమంటే ఏమిటి? ప్రమాణమంటే సత్యం. ‘ఈధర్మమే సత్యం’ అని నిర్థారించేవే ధర్మ ప్రమాణాలు. ఈ ధర్మానికి పరాకాష్ఠ మోక్షం. ఆ మోక్షం ఇతరమతస్థులు చెప్పేవిధంగా పురలౌకికంగా – ఇహలోకసాధ్యం. దానిని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి.

”అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః,
పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతా శ్చతుర్దశ.”
– మనుస్మృతి

”పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాంగ మిశ్రితాః,
వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ.”
– యాజ్ఞవల్క్య స్మృతి.

మన ప్రమాణగ్రంథాలు పదునాలుగు. సమస్తజ్ఞానమూ ఈపదునాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై యున్నందున వీనికి విద్యాస్థానాలని పేరు. అవి నాలుగువేదాలు. ఆరు అంగాలు. మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రాలు. సూటియైన ధర్మప్రమాణం వేదం. షడంగాలు అనేవి-శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం.

”ఆధీతి బోధాచరణ ప్రచారణౖ
ర్దశా శ్చతస్రః ప్రణయ న్ను నాధిభిః,
చతుర్దశత్వం కృతవాన్‌ కుతః స్వయం
న వేద్మి విద్యాసు చతుర్డశస్వపి.”
– నైషధం 1 సర్గ.

నలుడు చతుర్దశ విద్యలకు (పదునాలుగు విద్యలకు) చతుర్దశల (నాలుగు దశలు) ఇచ్చాడట-చదవడం, చదివినది తెలిసికోవడం, చదివినరీతి ఆచరించడం. తాను ఆచరించడమే కాక ఇతరులకుసైతం బోధించడం – ఇవి చతుర్దశలు. చతుర్థశ విద్యలకూ, చతుర్దశలు చేసినవాడు నలుడు. చతుర్దశ విద్యలకు మరొకనాలుగు చేర్చిన అష్టాదశ విద్యలగును. ఆత్మావలోకనం కలుగజేసేవి ఈ విద్యలు. అన్నీ వీనియందణగి ఉన్నవి.

సంస్కృత సూక్తి


సంస్కృత సూక్తి

” అల్పానా మపి వస్తూనాం సంహతి: కార్యసాధికా

తృణైర్గుణత్వ మాపన్నైర్భధ్యన్తే మత్తదన్తిన:

భావము : ఎంత చిన్నవైనను వస్తువులు కలిసిన గొప్ప కార్యములను సాధింపవచ్చును. గడ్డిపరకలను కొన్నిటిని కలిపివేసిన మదగజములను గూడా కట్టివేయవచ్చును. సంఘటనా కార్యమందలి మహత్వమిట్టిదియే.

సంస్కృత సుభాషితములు


. “ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ది శ్శక్తి: పరాక్రమ:
షడేతే యత్ర తిష్టన్తి తత్ర దేవ స్సహాయకృత్ ”

భావము : ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్భుద్ది, శక్తి, పరాక్రమము — ఈ ఆరు సుగుణములు ఎవరి వద్ద స్థిరముగా నుండునో వారికి దైవము కూడా సహాయ పడును.

పోతనను కాపాడిన ఆది వరాహం


పోతనను కాపాడిన ఆది వరాహం

పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు. కాని పోతన అందుకు ఒప్పుకోలేదు. ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు. ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు. అడవిలో మకాం వెసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు. ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది. ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారిని కోప్పడి తన సైన్యాధిపతులను పంపాడు. వారు కూడా ఆ పందిని చూసి భయపడి వచ్చేసారు. ఇక లాభం లేదనుకొని రాజే బయలుదేరాడు. ఆ రాజు కూడా ఆ పందిని చూసి ఒక బాణం వేసాడు. కాని ఆ పంది గుర్రు అనేటప్పటికి రాజు కూడా వెళ్ళిపోయాడు. కాని రాజు ఆలోచించాడు. అంత పెద్ద పందిని,అది కూడా తెల్లని భారీపంది భూమిపై ఎక్కడా ఉండదు కదా , బహుశా అదీ ఏ మాయో అనుకొన్నాడు. పోతనను రక్షించేందుకు వచ్చిందేమో అనుకొన్నాడు. పశ్చాత్తాపంతో మళ్ళీ పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ పంది లేదు. ఇంటి లోనికి వెళ్ళి పోతనను పలకరించాడు. పోతన గారు రాజును ఆహ్వానించగా, రాజు జరిగిన విషయం చెప్పాడు. అది విని పోతన కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి చూస్తే పంది యొక్క కాలిముద్రలను చూసి ఆ పాదదూళిని తన తలపై వేసుకొన్నాడు. తర్వాత ఒక అత్యద్భుత విషయాన్ని చెప్పాడు. ఆ పందిని రాజు బయట చూసిన సమయంలో పోతన గారు “యజ్ఞ (ఆది) వరాహ మూర్తి” అవతారఘట్టాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నాడు. ఆ వరాహమూర్తే పోతనను కాపాడాడు.

శ్రీకృష్ణలీలలు !


శ్రీకృష్ణలీలలు !

బాల కృష్ణుడిని ఎలాగైనా దొంగతనం చేయకుండా ఆపాలని ఒక గోపిక చాలా ఎత్తులో వెన్న పెట్టిన కుండలు పెట్టింది. వచ్చినా కనుగొనాలని ఆ కుండలకు గంటలు కట్టింది. తన పనులు చూసుకోసాగింది. కృష్ణుడు రానే వచ్చాడు. అంత ఎత్తులో ఉన్న కుండలను చూసాడు. రోల్లు, గిన్నెలు బోర్లించి పైకి ఎక్కాడు. కట్టబడి ఉన్న గంటలను చూసి మోగవద్దని వాటిని ఆదేశించాడు. అప్పుడు వెన్నను తీసుకొని మొదట స్నేహితులకు పెట్టాడు. గంటలు కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం మోగలేదు. అందరికి ఇచ్చిన తర్వాత తను కొద్దిగా తీసుకొని నోటిలో పెట్టుకున్నాడో లేదో గంటలు మ్రోగాయి. శ్రీకృష్ణుడు వెంటనే “మోగవద్దని చెప్పాను గదా! మళ్ళీ ఎందుకు మ్రోగారు?” అని అడిగాడు. అప్పుడు ఆ గంటలు చెప్పాయి ” ఏం చెప్పము స్వామీ ! తరతరాలుగా దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు గంటలను మ్రోగిస్తారు కదా. అందుకే నీవు నోటిలో పెట్టుకొనేప్పుడు మ్రోగాము” అన్నాయి. శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుండి జారుకొన్నాడు.