వాల్మీకి మహర్షి తీర్పు — 4


వాల్మీకి మహర్షి తీర్పు — 4

నహ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే! దేయం తు సర్వదా । ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౬వ శ్లోకము)

గుహుడు భరతునితో శ్రీరాముని సత్యపరాక్రమము, ధర్మనిరతిని, శ్లాఘిస్తూ అతడు భక్షభోజ్యాలు సమర్పించినప్పుడు, వాటిని అతి సున్నితముతా నిరాకరిస్తూ శ్రీరాముడు పలికిన ధర్మోక్తులను ఈ శ్లోకము ద్వారా చెప్పెను:

“ మహాత్ముడైన శ్రీరాముడు నన్ను ఈ క్రింది అనునయ వాక్యాలతో బుజ్జగించెను: ’ఓ ప్రియసఖా! మావంటి క్షత్రియులు ఎప్పుడూ (ప్రజలకు) ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ (ప్రజలనుండి) పుచ్చుకోకూడదు’.”

మనము నేర్వవలసిన నీతులు:

క్షత్రియులు ఎప్పుడూ అర్హులైన అర్థులకు వారి కామ్యములను ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ ప్రత్యుపకారము కానీ, ఇతర ఏ కామ్యములను కానీ, ప్రజలనుండీ స్వీకరించరాదు (ప్రభుత్వమునుకు నడుపుటకై ౧/౬ భాగము మించకుండా స్వీకరించవచ్చు). ఇట్టి ధర్మాలు దృఢముగా పాటించినారు కనుకనే భారతీయరాజులు చిరస్మరణీయులైనారు.
శ్రీరాముని సూక్ష్మబుద్ధి, ధర్మనిరతి, బాగుగా వ్యక్తమగుతున్నది. ఒకవైపు స్నేహధర్మం ప్రకారము గుహుడిచ్చినది స్వీకరింపవలెను. మరొకపక్క రాజధర్మము ప్రకారము స్వీకరించరాదు. ఇట్టి పరస్పర విరుద్ధ సన్నివేశములో విశేషధర్మమైన రాజధర్మమును పాటించి, సామాన్య ధర్మమైన స్నేహమును విడిచిపెట్టెను.
నిరాకరించవలసివచ్చినా, ప్రమతో సమర్పించిన గుహుని మనస్సు నొప్పించకుండా, శ్రీరాముడు మధుర వచనములతో ఆతని బుజ్జగించెను. మనముకూడా ఇట్టి ప్రియభాషణములనే చేయవలెను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s