వాల్మీకి రామాయణం శ్రీరాముని పట్టాభిషేకంతో ముగిసింది.


వాల్మీకి రామాయణం శ్రీరాముని పట్టాభిషేకంతో ముగిసింది.
అందరికీ బాగా తెలుసున్న వాల్మీకి రామాయణ గాధ రాముడి జననం , సీతాకళ్యాణం తో మొదలై రాముడి అరణ్యవాసం , సీతాప హరణం, రావణ సమ్హారానంతరం శ్రీ రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తరువాత కథ చాలా మందికి తెలిసేంతలా ప్రాచుర్యం కాలేదు. దానికి కారణం రామాయణం విషాదాంతం కావడమేమోనని పండితులు అంటుంటారు.
రామాయణం రెండు భాగాలుగా ఉంది. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం వరకు మొదటి భాగం. శ్రీ రామ పట్టాభిషేకం నుంచి నుంచి శ్రీ రామ నిర్యాణం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగాన్నే ఉత్తర రామాయణం అంటారు. ఈ ఉత్తర రామాయణాన్ని భవభూతి సంస్కృతంలో రాసాడు. ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
శ్లోకం. ఏకో రస కరుణ ఏవ నివర్తి ఖేదా
భిన్న పృథగ్ పృథగి వాశ్రయతే వివర్తా
ఆవర్త బుద్బుద తరంగ మాయాన్ వికారాస్
అంభో యధా సలిల మే వహి తత్సమస్తం
కరుణకు భావస్థాయి శ్లోకం. ఎందుకంటే వాల్మీకి మొదటి శ్లోకం (” మాన్నిషాద” ) కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. తిక్కన సోమయాజి నిర్వచనోత్తమ రామాయణం ( వచనం లేని , కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా రాసాడు. ” జానకీఈ జాని కథల్ రచింపక యసత్కథలెన్ని రచించెనేనియున్ … వాని కవిత్వ మహత్త్వమేటికిన్?” అన్నాడు పాపరాజు. నిజంగానే కవి అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణా ఉన్నవాడు రాముడు.
1990 లో శ్రీ వేమూరి వెంకటేశ్వర శర్మ గారు “ఉత్తర రామాయణ కధలు ” ఇప్పుడు అది అలభ్యగా గోచరిస్తున్నది.
కాని మిత్రులెవరో దానిని ఈ శృంఖలలో భద్రపరిచారు. ఉత్తర రామాయణం లోని కధలు చదవాలనుకున్న వారికి ఇది ఉపయోగపడ గలదు.

https://archive.org/details/uttararamayanaka024864mbp

నేను పై వ్రాసిన వ్యాక్యాలు ఈ పుస్తకానికి ఆచార్య తిరుమల గారు వ్రాసిన “అద్దంలో అవనీధరం” అనే ముందుమాట లోనివి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s