వాల్మీకి మహర్షి తీర్పు – 3


వాల్మీకి మహర్షి తీర్పు – 3

ఆసనం పూజయామాస రామాయాభి ప్రణమ్య చ । వాలవ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే ॥
శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ఏకనవతితమస్సర్గః (౩౮వ శ్లోకము)

భరధ్వాజముని తన తపశ్శక్తితో విశ్వకర్మని ఆహ్వానించి, భరతుడు మరియు అతని పరివారము ఆ రాత్రికి విడిదిచేయుటకు, ఒక అలౌకికమైన దివ్య భవనమును సృష్టించెను. అప్పుడు ఆ భవనములో ప్రవేశించిన భరతుడు “సభలోనున్న ఉత్కృష్టమైన సింహాసనముపై శ్రీరాముడు విరాజమానమై ఉన్నట్టు భావించి, దానిని పూజించి, నమస్కరించెను. తరువాత, ఒక సచివుడు కూర్చునే ఆసనముపై తాను కూర్చొనెను.”

మనము నేర్వవలసిన నీతులు:
ఒక ఇంట్లో అన్నిటికన్నా శేష్ఠమైన ప్రదేశములో, శ్రేష్ఠమైన ఆసనముపై భగవంతుని ఆహ్వానించి పూజించాలి.
భవవంతునికన్నా పెద్ద, ఉన్నత ఆసపై ఎన్నడూ కూర్చుండరాదు.
అట్లే పెద్దలైన వారికి ఉన్నతాసనము వదిలి, పిన్నలు ఉచితాసనములపై కూర్చొనాలి. ఎవరి అర్హతకు తగ్గ ఆసనమును వారికి ఇవ్వాలి.
ఏ పని చేసినా భగవంతుని స్మృతిపథములో ఉంచుకొనే భరతుని కర్మయోగమునకు జేజేలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s